iam Mahi (@mahenderalthati) 's Twitter Profile
iam Mahi

@mahenderalthati

Live by ur true Madness...the WORLD will adjust..
👍

ID: 1655016079

calendar_today08-08-2013 09:30:00

479 Tweet

956 Followers

449 Following

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

చూడగలిగితే ప్రతి ఒక్కడికీ ఒక యుద్ధం ఉంటుంది అది వదిలేసి పక్కోడి బ్రతుకులో నీదగ్గర లేనిదేదో ఉందని ఎందుకేడుస్తావ్ ? అక్కర్లేనివన్నీ వెతికి పట్టుకునే సులువు తెలుసు కానీ నిన్ను నువ్వు తెలుసుకునే తెలివి లేదా నీకు ?

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

అస్సలు అంచనాలు పెట్టుకోకుండా మొదలుపెట్టు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది చేరాల్సిన గమ్యం ఒకటే ! ప్రయత్నాలకోసం ప్లానింగ్ చేయకు,నిన్ను దాటే ప్రతి నిమిషం ఒక అవకాశమే నీకు ! బయలుదేరు,దారులు వాటంతట అవే నీ కాళ్ళకి తగులుతాయి !

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

ప్రపంచం అవసరానికి మించి అప్డేట్ అయిపోయింది. మంచితం ఒక ముసుగయింది,మోసం స్నేహమని పేరు మార్చుకుంది. ప్రేమనేది ఇపుడు పరుపులపై ఆటమాత్రమే ! అన్నింటా అప్రమత్తమై ఉండు... తగ్గావంటే గుండుగీసి బేరం పెట్టేస్తారు.

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

అన్నింటా ఉన్నట్టే ఉండు,కానీ ఒక్కడివే ఉండు ! ఎవడినీ మోసం చేయకు, ఎవడికీ ఆ అవకాశం ఇవ్వకు ! లోకం మంచిదే ! మనుషులే ...

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

నీ చుట్టూ తిరుగుతూనే నిన్నొదిలేసి ముందుకు వెళ్ళిపోతుంది కాలం... కావలసినంత ఉంది కదా అని కాలు చాపుకుని కూర్చోకు ఆది పోయిందని తెలుసుకునేలోపే ఏళ్లు గడిచిపోతాయి...

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

దాని టైమ్ బాలేనపుడు సింహం కూడా ఏ సర్కస్ లోనో సంతలోనో కుప్పిగంతులేయాల్సి వస్తుంది. నీ టైమ్ బాలేనపుడు నీ పరిస్థితి కూడా అంతే... పొంతనలేని జీవితం గడపాల్సి వస్తుంది. అంతమాత్రాన నువ్వు తగ్గినట్టు కాదు నెగ్గే రోజు ఇంకా రాలేదంతే !

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

కొడితే కోటలు బద్దలు అయ్యేలాగా బలంగా కొట్టు లేకపోతే అటువైపు కన్ను ఎత్తి కూడా చూడకు....

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే, శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే.. మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు..🪔🎉🎉🎉🎉🎉

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

జీవితంలో చాలాసార్లు ఓడిపోతాం అది పెద్ద విషయమేమీ కాదు చాలాసార్లు ప్రయత్నించావు చూడూ ... అదీ గొప్ప విషయం ! నీకు ఎవడూ చెప్పలేదేమో కానీ నువ్వెప్పుడో గెలిచే ఉంటావ్

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

విజయం అనేది అందంగా ముస్తాబైన అబద్ధం లాంటిది... ఓటమి అనేది బట్టలు లేకుండా నిలబెట్టిన నిజం లాంటిది...

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

కూల్చొటోన్నీ కూలగొట్టడం పెద్ద విషయం కాదు.. కానీ వాడు కూలిపోయే రోజు కాలం గర్జించే గర్జన‌ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. పేదోడిని కూల్చిన పెద్దోడి చరిత్ర ఇప్పటి‌కి‌ ఎప్పటికి కూకటివేళ్లతో కూల్చపడ్డ చరిత్ర. మళ్లీ లెవ్వరు.. లేచి నిలవరు.. నిలిచి గెలవరు.

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ తప్పకుండా ఏదో ఒక రోజు చూపించాలి...

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

మనుషులనే ఆపలేకపోతున్నాం.... ఇంకా వాళ్ళ మాటలని ఏం ఆపగలం.... అయినా అనుకునేవాడు అనుకుంటూనే ఉంటాడు... ఒకడు అన్నాడనో..... అది నేను విన్నానానో... నా క్యారెక్టర్ ఎప్పుడు మారిపోదు....

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

కొన్ని అవమానాలు జరిగాకే..... కొన్ని అద్భుతాలను చూడగలుగుతాం...ms_writings✍️

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

నీ మీద నవ్విన వాళ్లకి ఒక రోజు నీ ముందుకి రావటానికి కూడా ధైర్యం ఉండదు....ms_writings✍️

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

గొప్పగా మారాలి అంటే అనుభవం అవసరం లేదు... బలమైన ఘోర అవమానం చాలు...

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

అరచేతిలోకి ప్రపంచం వచ్చేసిందనే భ్రమలో ప్రయత్నాలు మానేసి కాలక్షేపం చేస్తూ కూర్చున్నావు నీ సమయాన్ని వాడెవడో వాడుకుని ప్రయత్నించి గెలుస్తున్నాడు. ఇప్పటికైనా ఏదో ఒకటి చెయ్...కనీసం ఓడిపోవడానికైన అర్హత కావాలి కదా !

iam Mahi (@mahenderalthati) 's Twitter Profile Photo

వీలైతే యుద్ధం ఆపడానికి వెనక్కి తగ్గు ఒకసారి మొదలెట్టాక అది చావైనా సిద్ధపడు !