Gittha(@gittha13) 's Twitter Profileg
Gittha

@gittha13

కలం కదలట్లేదు .. కాలం ఆగట్లేదు

ID:1145776223202762754

calendar_today01-07-2019 19:28:33

5,3K تغريدات

12,1K متابعون

86 التالية

Gittha(@gittha13) 's Twitter Profile Photo

వసంత ఋతువు ఆగమనంతో, శ్రీ క్రోధి నామ నూతన సంవత్సర ఉగాదికి స్వాగతం పలుకుతూ అందరికీ తొలి పండుగ శుభాకాంక్షలు. అధర్మం పట్ల క్రోధాన్ని, ధర్మం పట్ల మైత్రీభావాన్ని పెంపొందించే విధంగా ఈ ఉగాది కొత్త వెలుగు మీ జీవితంలో శాంతిని, శ్రేయస్సుని, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటూ...
🩷🩷

వసంత ఋతువు ఆగమనంతో, శ్రీ క్రోధి నామ నూతన సంవత్సర ఉగాదికి స్వాగతం పలుకుతూ అందరికీ తొలి పండుగ శుభాకాంక్షలు. అధర్మం పట్ల క్రోధాన్ని, ధర్మం పట్ల మైత్రీభావాన్ని పెంపొందించే విధంగా ఈ ఉగాది కొత్త వెలుగు మీ జీవితంలో శాంతిని, శ్రేయస్సుని, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటూ... 🩷🩷 #గిత్త
account_circle
Gittha(@gittha13) 's Twitter Profile Photo

ఇన్ని రోజులు యాదృచ్ఛికమే అనుకున్నా కానీ ఇప్పుడే అర్థమయ్యింది! నిన్ను కలిసిన ప్రతిసారి నా ఉనికిలోని ఎంతో కొంత నీ దగ్గిరే ఉండిపోతోంది. నీ చుట్టూ సరిగ్గా చూస్తే, అక్కడక్కడ నేను తునాతునకలుగా నీకు కనపడతాను. అసలు గమనించావో లేదో? ఈసారి ఏకంగా నా గుండె, నాతో రానని, నీ వెనకే మిగిలిపోయింది!

అంతర్మథనం...
నాకు నువ్వు ఎదురైనప్పుడెల్లా కళ్ళతోటే మాటలు కలపగలను ఎందుకంటే లిపి లేని భాషలో లిఖితమైన ఓ విలువైన పుస్తకం నువ్వు. ఆ భాష చదవలేని భావుకతతో నిన్ను నా గుండె గ్రంథాలయంలో భద్రంగా దాచేసుకోవాలని తాపత్రయపడే ఓ నిరక్షరాస్యుడిని నేను....

account_circle
Gittha(@gittha13) 's Twitter Profile Photo

పదే పదే నిను గమనిస్తూ మౌనంగా ఆరాధించడం
పదే పదే నీ చూపులు చెప్పే కొంటె కథలు రెప్పార్పకుండా వినడం
పదే పదే 'నీలో నేనా లేక నాలో నువ్వా' అని ఆశ్చర్యపోవడం
పదే పదే నీతో ఉన్న క్షణాలు నిలిచిపోవాలని కోరుకోవడం
పదే పదే నీ ప్రేమలో కరిగిపోయే నా మనసు నీకేమివ్వగలదు? జీవితకాలం అంకితమైపోడం తప్ప 🫶

పదే పదే నిను గమనిస్తూ మౌనంగా ఆరాధించడం పదే పదే నీ చూపులు చెప్పే కొంటె కథలు రెప్పార్పకుండా వినడం పదే పదే 'నీలో నేనా లేక నాలో నువ్వా' అని ఆశ్చర్యపోవడం పదే పదే నీతో ఉన్న క్షణాలు నిలిచిపోవాలని కోరుకోవడం పదే పదే నీ ప్రేమలో కరిగిపోయే నా మనసు నీకేమివ్వగలదు? జీవితకాలం అంకితమైపోడం తప్ప 🫶
account_circle
Gittha(@gittha13) 's Twitter Profile Photo

అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ,
చాలబెద్దమ్మ, సురారులమ్మ కడుపాఱడి బుచ్చిన యమ్మ,
దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ,
దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్🙏

ఆ ఆదిశక్తి, కృపతో మనందరిని అనుగ్రహించాలని కోరుతూ, బోనాలు/విజయదశమి శుభాకాంక్షలు!

అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలబెద్దమ్మ, సురారులమ్మ కడుపాఱడి బుచ్చిన యమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్🙏 ఆ ఆదిశక్తి, కృపతో మనందరిని అనుగ్రహించాలని కోరుతూ, బోనాలు/విజయదశమి శుభాకాంక్షలు!
account_circle