Nikhil Prabhas🚩ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@nikhil__prabhas) 's Twitter Profile
Nikhil Prabhas🚩ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ

@nikhil__prabhas

#Prabhas🎞
#ViratKohli🏏
#LordKrishna🚩🪈

ID: 1655544767604994048

calendar_today08-05-2023 12:06:58

3,3K Tweet

678 Takipçi

1,1K Takip Edilen

Nikhil Prabhas🚩ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@nikhil__prabhas) 's Twitter Profile Photo

సాంఖ్య యోగము 50 వ శ్లోకం : బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే ।తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ వివరణ: వివేకముతో ఈ కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యం తో పని చేయటం అనే, యోగ అభ్యాసము చేయుము.

సాంఖ్య యోగము

50 వ శ్లోకం  : 
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే ।తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్

వివరణ: 
వివేకముతో ఈ కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యం తో 
పని చేయటం అనే, యోగ అభ్యాసము చేయుము.
Nikhil Prabhas🚩ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@nikhil__prabhas) 's Twitter Profile Photo

సాంఖ్య యోగము 51 వ శ్లోకం: కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్వక్త్వా మనీషిణః ।జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ వివరణ: జ్ఞానులు,సమత్వ బుద్ది కలిగి ఉండి జననమరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకార-ఆసక్తులను త్యజించి ఉంటారు.ఇలాంటి భావన తో పని చేయటం వలన దుఃఖరహితమైన స్థితిని పొందెదరు

Nikhil Prabhas🚩ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@nikhil__prabhas) 's Twitter Profile Photo

సాంఖ్య యోగము 52 వ శ్లోకం : యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి ।తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ।। 52 ।। వివరణ: మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి, ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది. (ఇహపర లోక భోగముల విషయంలో).

సాంఖ్య యోగము

52 వ శ్లోకం  : 
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి ।తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ।। 52 ।।

వివరణ: 
మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి, ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది. (ఇహపర లోక భోగముల విషయంలో).
Nikhil Prabhas🚩ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@nikhil__prabhas) 's Twitter Profile Photo

సాంఖ్య యోగము 53 వ శ్లోకం : శృతివిప్రతి పన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా ।సమాధావచలా బుద్ధిస్తదా యోగామవాప్స్యసి ।। 53 ।। వివరణ: కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదవు

Nikhil Prabhas🚩ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@nikhil__prabhas) 's Twitter Profile Photo

54 వ శ్లోకం: అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ వివరణ: అర్జునుడు పలికెను: ఓ కేశవా భగవత్ ధ్యాస నందే స్థిరముగా ఉన్న వాని ప్రవృత్తి ఎలా ఉంటుంది? జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును? అతను ఎలా కూర్చొనును? అతను ఎలా నడుచును

54 వ శ్లోకం: 
అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్

వివరణ: 
అర్జునుడు పలికెను: ఓ కేశవా భగవత్ ధ్యాస నందే స్థిరముగా ఉన్న వాని ప్రవృత్తి ఎలా ఉంటుంది? జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును? అతను ఎలా కూర్చొనును? అతను ఎలా నడుచును
Nikhil Prabhas🚩ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@nikhil__prabhas) 's Twitter Profile Photo

56 వ శ్లోకం : దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ।। 56 ।। వివరణ: దుఃఖముల నడుమ కూడా కలతచెందని వాడు, సుఖముల కోసం ప్రాకులాడని వాడు; మమకారము, భయము, క్రోధము విడిచిన వాడిని స్థిత-ప్రజ్ఞుడైన ముని అని అంటారు.

56 వ శ్లోకం  : 
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ।। 56 ।।

వివరణ: 
దుఃఖముల నడుమ కూడా కలతచెందని వాడు, సుఖముల కోసం ప్రాకులాడని వాడు; మమకారము, భయము, క్రోధము విడిచిన వాడిని స్థిత-ప్రజ్ఞుడైన ముని అని అంటారు.
Nikhil Prabhas🚩ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@nikhil__prabhas) 's Twitter Profile Photo

సాంఖ్య యోగము 57 వ శ్లోకం: యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ నాభినందంతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా వివరణ: ఎవరైతే అన్నీ పరిస్థితులలో ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు కష్టాలకు క్రుంగిపోకుండా ఉంటాడో, అతను పరిపూర్ణ జ్ఞానం తో ఉన్న ముని.

Nikhil Prabhas🚩ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@nikhil__prabhas) 's Twitter Profile Photo

58 వ శ్లోకం: యదా సంహరతే చాయం కూర్మోంఽగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా వివరణ: తాబేలు తన పైచిప్ప లోనికి, దాని అంగములను ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్ధముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు, దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును

58 వ శ్లోకం: 
యదా సంహరతే చాయం కూర్మోంఽగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

వివరణ: 
తాబేలు తన పైచిప్ప లోనికి, దాని అంగములను ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్ధముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు, దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును
Nikhil Prabhas🚩ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@nikhil__prabhas) 's Twitter Profile Photo

సాంఖ్య యోగము 59 వ శ్లోకం : విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః ।రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే వివరణ: సాధకులు ఇంద్రియములను భోగ వస్తు/విషయముల నుండి నియంత్రించినా, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ రుచి కూడా అంతమగును.

సాంఖ్య యోగము

59 వ శ్లోకం :
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః ।రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే

వివరణ: 
సాధకులు ఇంద్రియములను భోగ వస్తు/విషయముల నుండి నియంత్రించినా, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ రుచి కూడా అంతమగును.
Nikhil Prabhas🚩ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@nikhil__prabhas) 's Twitter Profile Photo

సాంఖ్య యోగము 60 వ శ్లోకం : యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ।ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ।। 60 ।। వివరణ: ఇంద్రియములు ఎంత బలవత్తరమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీ పుత్రుడా, వివేకము కలిగి, స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కోనిపోగలవు.

Nikhil Prabhas🚩ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@nikhil__prabhas) 's Twitter Profile Photo

సాంఖ్య యోగము 61 వ శ్లోకం : తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః ।వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః ।। 61 ।। వివరణ: ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని, మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో, వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు.

సాంఖ్య యోగము

61 వ శ్లోకం  : 
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః ।వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః  ।। 61 ।।

వివరణ: 
ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని, మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో, వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు.
Nikhil Prabhas🚩ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@nikhil__prabhas) 's Twitter Profile Photo

సాంఖ్య యోగము 62 వ శ్లోకం : ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ।। 62 ।। వివరణ: ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగ చేస్తుంది, ఆ కోరికల నుండే క్రోధం ఉత్పన్నమవుతుంది.