వాక్కేళి! (@ivak99) 's Twitter Profile
వాక్కేళి!

@ivak99

తెలుగు కవిత+పాటల్రచైత #VakBharatam #Olymricks #EkapadyaRamayanam #శతపద్యపద్మం #సండేసైన్సుదశకం #వంటలు #తోటరయ్యదశకం #పెంకిపాటలు ఇక్కడంతా వ్యక్తిగత అభిప్రాయమే

ID: 22332332

calendar_today01-03-2009 04:38:03

63,63K Tweet

11,11K Takipçi

266 Takip Edilen

వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

తొమ్మిది మెట్లూ అన్నే రాత్రులు ఉమ్మడిబతుకుల జీవనయాత్రలు అమ్మలగన్న అమ్మలు అయ్యలు బొమ్మలకొలువున ఇహపర పాత్రలు! #దసరా

తొమ్మిది మెట్లూ అన్నే రాత్రులు
ఉమ్మడిబతుకుల జీవనయాత్రలు
అమ్మలగన్న అమ్మలు అయ్యలు
బొమ్మలకొలువున ఇహపర పాత్రలు!

#దసరా
వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

వడ్డాది పాపయ్య గారి యువ #దీపావళి సంచిక ముఖచిత్రం!! కనులగ్ని వర్షింప కృష్ణుండు హర్షింప ఎక్కుపెట్టెను అంప సత్య నరకుని చంప! #దీపావళిశుభాకాంక్షలు 🪔🪔🕉️🪔🪔

వడ్డాది పాపయ్య గారి యువ #దీపావళి సంచిక ముఖచిత్రం!!

కనులగ్ని వర్షింప
కృష్ణుండు హర్షింప
ఎక్కుపెట్టెను అంప
సత్య నరకుని చంప!

#దీపావళిశుభాకాంక్షలు 🪔🪔🕉️🪔🪔
Sanatan Dharma (@_sanatandharma) 's Twitter Profile Photo

The 9 Sanskrit Grammars Lost to Time- ‘Nava Vyakaraṇa’ A forgotten treasure of Sanatan Dharma! Let’s rediscover the divine roots of our language and the 9 Vyakaraṇas (Grammar Systems) of Ancient Bharat. 👇 A 🧵#Thread every Bharatiya must read.

The 9 Sanskrit Grammars Lost to Time- ‘Nava Vyakaraṇa’
A forgotten treasure of Sanatan Dharma!
Let’s rediscover the divine roots of our language and the 9 Vyakaraṇas (Grammar Systems) of Ancient Bharat.
👇 A 🧵#Thread every Bharatiya must read.
వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

#గురుపూర్ణిమ సందర్భంగా వేదవ్యాసులవారిని స్మరించుకుంటూ, నా #వాక్భారతం లోని మొదటి కవిత! 🙏 మూషిక వాహను రాయగ దశదిక్కుల ప్రసిద్ధి కెక్కెగ విశాల భారత దీపిక వ్యాసుడి మానస పుత్రిక!

#గురుపూర్ణిమ సందర్భంగా వేదవ్యాసులవారిని స్మరించుకుంటూ, నా #వాక్భారతం లోని మొదటి కవిత! 🙏 

మూషిక వాహను రాయగ
దశదిక్కుల ప్రసిద్ధి కెక్కెగ
విశాల భారత దీపిక
వ్యాసుడి మానస పుత్రిక!
వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

నవరసాల పూదోట మెరుపుల విరుపుల మాట విలనీకి పెట్టని కోట వేరెవ్వరు తెలుగునాట! #కోటశ్రీనివాసరావు 🙏😢 #తెలుగు

నవరసాల పూదోట
మెరుపుల విరుపుల మాట
విలనీకి పెట్టని కోట
వేరెవ్వరు తెలుగునాట!

#కోటశ్రీనివాసరావు 🙏😢

#తెలుగు
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

Prayed at the Brihadisvara Temple, Gangaikonda Cholapuram. It was a deeply spiritual experience at one of India’s finest expressions of Chola devotion. I prayed for the prosperity and well-being of the people of India.

Prayed at the Brihadisvara Temple, Gangaikonda Cholapuram. It was a deeply spiritual experience at one of India’s finest expressions of Chola devotion. I prayed for the prosperity and well-being of the people of India.
వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

పచ్చటి ఆకులు దూసీ, రోటిలొ, పచ్చడి చేసీ; ముచ్చటగా చేతికేసి, మెదపక, ముచ్చటలాడీ; వచ్చిన వారందరికీ, దిద్దుతు, వచ్చను తీర్చీ; అచ్చెర కొలుపుతు పండగ, పండగె, అచ్చర కోటికి! #తెలుగుదనం

వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

అందరికీ #నాగపంచమి శుభాకాంక్షలు! పుట్టలోపలి నాగజాతికి పాలు పోస్తాం, పూజ చేస్తాం! మట్టుపెట్టగ, పైరు వైరుల, సంతసిస్తాం, మొక్కులిస్తాం! మట్టి‌మనుషుల గొప్ప సంస్కృతి కాపు కాస్తాం, ప్రాణమిస్తాం! పుట్టవెలుపలి విషప్పురుగుల అంతుచూస్తాం కాలరాస్తాం! #NagPanchami

అందరికీ #నాగపంచమి శుభాకాంక్షలు!

పుట్టలోపలి నాగజాతికి పాలు పోస్తాం, పూజ చేస్తాం!
మట్టుపెట్టగ, పైరు వైరుల, సంతసిస్తాం, మొక్కులిస్తాం!
మట్టి‌మనుషుల గొప్ప సంస్కృతి కాపు కాస్తాం, ప్రాణమిస్తాం!
పుట్టవెలుపలి విషప్పురుగుల అంతుచూస్తాం కాలరాస్తాం!

#NagPanchami
వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

వందేమాతరమంటూ మనసుతీర జైకొట్టూ ‌సందేహించకు బంధూ జెండా చేతను పట్టూ ఎందరి ఊపిరి త్యాగం ఈ స్వేచ్ఛావాయులీన మందరి నొకపరి తలచీ వేడుకలను మొదలుపెట్టు! 🇮🇳 భారతీయులందరికీ #స్వాతంత్ర్యదినోత్సవశుభాకాంక్షలు #IndianIndependenceDay

వందేమాతరమంటూ మనసుతీర జైకొట్టూ
‌సందేహించకు బంధూ జెండా చేతను పట్టూ
ఎందరి ఊపిరి త్యాగం ఈ స్వేచ్ఛావాయులీన
మందరి నొకపరి తలచీ వేడుకలను మొదలుపెట్టు! 🇮🇳

భారతీయులందరికీ
#స్వాతంత్ర్యదినోత్సవశుభాకాంక్షలు #IndianIndependenceDay
వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

రెబ్బలు రెల్లులు పత్రిలు నే తెస్తూ చచ్చీచెడీ ఇబ్బడిముబ్బడిగా వంటలు చేసేస్తు అమ్మ రెడీ బొబ్బలు పెడుతూ గొప్పగ కథ చదివే నాన్న వడి అబ్బా ఏం హడావిడీ, ఏ పండక్కింత సడీ? అందరికీ #వినాయకచవితి శుభాకాంక్షలు 💐

రెబ్బలు రెల్లులు పత్రిలు నే తెస్తూ చచ్చీచెడీ
ఇబ్బడిముబ్బడిగా వంటలు చేసేస్తు అమ్మ రెడీ
బొబ్బలు పెడుతూ గొప్పగ కథ చదివే నాన్న వడి
అబ్బా ఏం హడావిడీ, ఏ పండక్కింత సడీ?

అందరికీ #వినాయకచవితి శుభాకాంక్షలు 💐
వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

#తెలుగుభాషాదినోత్సవం సందర్భంగా, మహనీయులు ఆచార్య గిడుగు రామమూర్తి పంతులు గారిని స్మరించుకుంటూ... వ్యావహారిక వడుగు హేతువాదం పిడుగు భాష పట్టిన గొడుగు తెలుగు పంతులు గిడుగు! 🙏

#తెలుగుభాషాదినోత్సవం సందర్భంగా, మహనీయులు ఆచార్య గిడుగు రామమూర్తి పంతులు గారిని స్మరించుకుంటూ...

వ్యావహారిక వడుగు 
హేతువాదం పిడుగు
భాష పట్టిన గొడుగు
తెలుగు పంతులు గిడుగు! 🙏
ట్వీటేశ్వరుడు (@btelugabbayi) 's Twitter Profile Photo

వింజమూరి కధలు - 1 ఎందుకు కాదు? ఎనభైల, తొంభైల దశాబ్దాల్లో నా వేసవి సెలవులు అన్నీ వింజమూరు లోనే గడిచేవి. నెల్లూరు జిల్లాలోని ఆ చిన్న గ్రామం బయట, ప్రధాన రహదారి దగ్గర ఒక చిన్న బస్‌స్టాప్ ఉండేది. అక్కడే బస్సులు ఆగి, ఒక చిన్న రోడ్డులో నుంచి లోపల గ్రామానికి వెళ్లేవి. బస్‌స్టాండ్‌ పక్కనే

వింజమూరి కధలు - 1 ఎందుకు కాదు?
ఎనభైల, తొంభైల దశాబ్దాల్లో నా వేసవి సెలవులు అన్నీ వింజమూరు లోనే గడిచేవి. నెల్లూరు జిల్లాలోని ఆ చిన్న గ్రామం బయట, ప్రధాన రహదారి దగ్గర ఒక చిన్న బస్‌స్టాప్ ఉండేది. అక్కడే బస్సులు ఆగి, ఒక చిన్న రోడ్డులో నుంచి లోపల గ్రామానికి వెళ్లేవి. బస్‌స్టాండ్‌ పక్కనే
వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

#ఆరుద్ర జయంతి సందర్భంగా ఆయన గురించి నా కవిత, మళ్ళీ పంచుకుంటున్నా 🙏 తెలుగుచరితం గొప్ప గుబురు గడ్డం తప్ప ఎవరు చెప్పిననొప్ప ఓ కూనలమ్మ! పిచుకగూడే క్రాఫు రామలక్ష్మిలొ హఫు ఫెమినిజం కేరాఫు ఓ కూనలమ్మ! అంత్యప్రాసల మోసు అచ్చతెలుగులొ డోసు ఇచ్చి వెళ్ళిన బాసు ఓ కూనలమ్మా! #తెలుగు

#ఆరుద్ర జయంతి సందర్భంగా ఆయన గురించి నా కవిత, మళ్ళీ పంచుకుంటున్నా 🙏

తెలుగుచరితం గొప్ప 
గుబురు గడ్డం తప్ప
ఎవరు చెప్పిననొప్ప 
ఓ కూనలమ్మ!

పిచుకగూడే క్రాఫు
రామలక్ష్మిలొ హఫు
ఫెమినిజం కేరాఫు
ఓ కూనలమ్మ!

అంత్యప్రాసల మోసు
అచ్చతెలుగులొ డోసు
ఇచ్చి వెళ్ళిన బాసు
ఓ కూనలమ్మా!

#తెలుగు
వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు! 💐 ముప్పావు శతాబ్దం గమనం, దేశానికె అంకితం మప్పావు జనతకు సతతం, వికసిత భారత స్వప్నం తిప్పావు దేశ భవితవ్యం, చేసి ఆత్మనిర్భర సంతకం గుప్పావు కాన్కలు అమితం, దీవించగ సనాతనం! #HappyBirthdayModiji

ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు! 💐

ముప్పావు శతాబ్దం గమనం, దేశానికె అంకితం
మప్పావు జనతకు సతతం, వికసిత భారత స్వప్నం
తిప్పావు దేశ భవితవ్యం, చేసి ఆత్మనిర్భర సంతకం
గుప్పావు కాన్కలు అమితం, దీవించగ సనాతనం!

#HappyBirthdayModiji
వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

అందరికీ #దసరా శుభాకాంక్షలు! రంగురంగుల, ఆటపాటల, హాయినవ్వుల, సిరిసంపదల, పసిడిపంటల, ఆలమందల, మంచిమనసుల సనాతన సంస్కృతీ, ధర్మం కలకాలం నిలవాలి! చెడుపై విజయం సాధించాలి! 🙏

అందరికీ #దసరా శుభాకాంక్షలు!
 రంగురంగుల, ఆటపాటల, హాయినవ్వుల, సిరిసంపదల, పసిడిపంటల, ఆలమందల, మంచిమనసుల సనాతన సంస్కృతీ, ధర్మం కలకాలం నిలవాలి! చెడుపై విజయం సాధించాలి! 🙏
వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

తనువూ, మనసుల పలు రుగ్మతలకు ఇతడే అరి సనాతనధర్మం కొలిచిన ఆది భిషక్ సాక్షాత్ హరి ఘన ఆయుర్వేదపు జ్ఞానం తొణకు అమృత కలశధారి ధనత్రయోదశి పరంపరకాద్యుడు పూజ్యుడు ధన్వంతరి! 🙏 అందరికీ #ధనత్రయోదశి #Dhanteras శుభాకాంక్షలు 🧨🎆🪔

తనువూ, మనసుల పలు రుగ్మతలకు ఇతడే అరి
సనాతనధర్మం కొలిచిన ఆది భిషక్ సాక్షాత్ హరి
ఘన ఆయుర్వేదపు జ్ఞానం తొణకు అమృత కలశధారి
ధనత్రయోదశి పరంపరకాద్యుడు పూజ్యుడు ధన్వంతరి! 🙏

అందరికీ #ధనత్రయోదశి #Dhanteras శుభాకాంక్షలు 🧨🎆🪔
వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

అందరికీ #దీపావళి శుభాకాంక్షలు 🪔🎆🧨🕉️ అజ్ఞానపు తిమిరాలని పారదోలు దివ్వెలజడి ఆ జ్ఞానపు ఝరి వెల్లువ చాటించెడి రవ్వలసడి యాజ్ఞికులుగ సంసారులు ఆవరణం వెలుగువేది ఈ జ్ఞాతము తుష్టిదాయి; ఈ పర్వం మించి ఏది!? #Deepavali

అందరికీ #దీపావళి శుభాకాంక్షలు 🪔🎆🧨🕉️

అజ్ఞానపు తిమిరాలని పారదోలు దివ్వెలజడి
ఆ జ్ఞానపు ఝరి వెల్లువ చాటించెడి రవ్వలసడి
యాజ్ఞికులుగ సంసారులు ఆవరణం వెలుగువేది
ఈ జ్ఞాతము తుష్టిదాయి; ఈ పర్వం మించి ఏది!?

#Deepavali