R S Hymavathi (@shr1234p) 's Twitter Profile
R S Hymavathi

@shr1234p

telugu writer

ID: 3248212842

calendar_today18-06-2015 01:10:38

19,19K Tweet

7,7K Takipçi

162 Takip Edilen

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

అడవులలో నడుస్తున్నప్పుడు రామునికాల్లో ముల్లుదిగింది.అది తీస్తూ లక్ష్మణుడు సీతా పైకేఅన్నారు.తల్లి కైక అడవులకి పంపితే కొడుకు ఉన్న పాదరక్షలు కూడా పట్టుకుపోయాడు అని దానికిరాముడు నొచ్చుకుని మీరు నాకు సేవచేయద్దు.నాతల్లిని తమ్ముడినీ ఏమీఅనకుండా వుంటేచాలు అన్నాడు.

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

మా వాకిట రాధామనోహరాలు గుత్తులుగా వ్రేలాడుతున్నాయి.

మా వాకిట రాధామనోహరాలు గుత్తులుగా వ్రేలాడుతున్నాయి.
R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

పాణితలంబున వెన్నయు వేణీమూలంబునందు వెలయగ పింఛం బాణీముత్యము ముక్కున జాణవునై దాల్తు శేషశాయివి కృష్ణా! కృష్ణా!చేతిలో వెన్నయు జుట్టు ముడియందు నెమలి పింఛం మంచి ముత్యము ముక్కున ధరించి జాణవై వెలుగొందుచున్న శేషశాయివి నీవు.

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

వడుగువువై మూడడుగుల నడిగితివౌ భళిర బలిని యఖిల జగంబుల్ దొడగితివి నీదుమేనున గడుచిత్రము నీచరిత్ర ఘనముగ కృష్ణా వడుగుగా వెళ్ళి బలిచక్రవర్తిని మూడడుగుల నేల దానమడిగి పొంది మూడడుగులతో ముల్లోకాలూ ఆక్రమించి అతడిని పాతాళానికి అణచిన ఘనచరిత్రకదా నీది కడువిచిత్రము కష్ణా!

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

మగని కాలమందు మగువ కష్టించిన సుతులకాలమందు సుఖము పొందు గలిమి లేమి రెండు గలవెంతవారికి బలిమి పుత్రు బలిమి బలిమివేమ మగని కాలంలో స్త్రీ కష్టపడితే సుతులకాలంలో సుఖపడవచ్చును.ఎంతటివారికైనా కలిమి లేమి తప్పవు.పుత్రులే బలము.అంటున్నాడు వేమన.ఈనాడది కొందరికే నిజం.

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగ యుక్తాత్మా విముక్తో మాముపైష్యసి శుభాశుభ కర్మల వలన కలిగెడు కర్మబంధము నీకుండదు.కర్మ ఫలత్యాగ కర్మానుష్టానము వలన జ్ఞానోపాయము గలవాడవై నన్ను పొందెదవు.భగవద్గీత

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

హా వసుదేవ కుమారక కావుము నామానమనుచు కామినివేడన్ ఆవనజాక్షికి నిచ్చితి శ్రీవర యక్షయమటంచు జీరలు కృష్ణా! పాండవులు మాయాజూదములో కౌరవులతో ఓడినప్పుడు తమసొత్తైందని ద్రౌపది వస్త్రాలు దుశ్శాశనుడు ఊడదీయుచుండగా ఆమె ప్రార్ధనవిని ఆమెకు చీరలక్షయముగా నిచ్చి కాపాడితివికదా!

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

అల్పబుధ్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల దొలుగగొట్టు చెప్పు తిన్న కుక్క చెరకుతీపెరుగునా విశ్వదాభిరామ వినురవేమ దుష్టబుధ్ధి గలవానికి అధికారమిస్తే తెలివైన సమర్ధులనందరినీ వెళ్ళగొడతాడు.చెప్పుతినే కుక్కకు చెరకు తీపి రుచించదుకదా! అట్లే!

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

రాముని మించిన దైవం అన్న భర్త హితుడు తనయుడు ఎవరూ లేరు ఉండరు.సీతమ్మని మించిన సాధ్వీలలామ మరిలేదు ఉండదు.లక్ష్మణ భరత శత్రుఘ్నులవంటి తమ్ములు ఎందునా కానరారు.కైకమ్మకు సవతితల్లిగా భర్తను చంపుకున్న పాతకిగా చెడ్డపేరొచ్చినా ఆమెవల్లే దుష్టసంహారమయింది.

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

దుర్వార చక్రధర కర శర్వాణీ ప్రముఖ వినుత జగదాధారా నిర్వాణ నాధ మాధవా సర్వాత్మక నన్ను కావు సరగున కృష్ణా చక్రధరా దేవతలచే పొగడబడువాడా జగతికి ఆధారమైనవాడా ముక్తి నిచ్చువాడా మాధవా అందరిలో నుండు ఆత్మ స్వరూపా వేగమే వచ్చి నన్నుకాపాడు తండ్రీ.కృష్ణా!

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

కుక్క తోక దెచ్చి గొట్టంబు జేర్చిన గ్రోవి చెంతనుండు కొంతతడవు ఎంతచెప్ప జెడుగు పంతంబు మానునా విశ్వదాభిరామ వినురవేమ కుక్కతోకని వంకర లేకుండాచేయవలెనని కొంతసేపు గొట్టములో వుంచినను బయటకు తీయగానే తిరిగివంకరగానే అగును.చెడ్డబుధ్ధులు గలవానికి ఎన్నిమంచిబుధ్ధులుచెప్పినను అతడిదుర్బుధ్ధులుపోవు

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

రామాయణంలో ప్రతీ పాత్రా కధా గమనానికి ముఖ్యమైనవే!దుష్ట పాత్రలు సహితం.ఉదాహరణకి మారీచ సుబాహులు,సూర్పణక,తాటకి వంటివారుకూడా!వారి వధతోనే రాముని కీర్తి ఇనుమడించింది.రావణుడు మారీచుని మాయలేడిగా వెళ్ళమన్నప్పుడు మారీచుడు రాముని ప్రతిభచెప్పాడు.అతడుచంపుతానంటే రామునిచేతే చస్తానని వెళ్ళాడు.

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

శ్రీరుక్మిణీశ కేశవ నారద సంగీత లోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా దశ్రీ రుక్మిణీ పతీ కేశవా నారదుని సంగీతానికి పయవశించువాడా కొండ నెత్తి ధరించినవాడా ద్వారకలో నివశించువాడా జనార్దనా కరుణతో మమ్ము కాపాడు తండ్రీ.కృష్ణ శతక పద్యం.

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

హరిచందనంబు మేనున గరమొప్పెడు హస్తములను గంకణరవముల్ ఉరమున రత్నము మెరయగ బరగితివే నీవు బాలప్రాయము కృష్ణా కృష్ణా నీవు చేతిలో వెన్నయు దేహముపై చందనము చేతులయందు కంకణములు శబ్దము చేయుచుండగా వక్షముపై రత్నము వ్రేలాడుతుండగా నీ బాలప్రాయమున అందముగా మెలగితివికదా!

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై ఎవ్వనియందుడిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముతానెయైనవా డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్ భాగవతం పోతనగారి గజేంద్రమోక్షంలోని పద్యం.

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

మనిషి బతకడానికి కావలసినది పట్టెడు మెతుకులు.ఎండవానలకి తట్టుకుని నిలబడడానికి పడుకోడానికి కావలసినది గూడు.అందుకు అక్రమంగా ఆస్థులు సంపాదించి మూటకట్టి ముందుతరాలకి అందించక్కర్లేదు.

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

ఎన్నిచదివినా ఎంతతెలుసుకున్నా ఎక్కడో గుళ్ళలో పండితుల ప్రవచనాలు జరుగుతూంటే చిన్నప్పటినించీ వినడానికి వెళ్ళేదాన్ని.నాఫ్రెండ్స్ ముసలమ్మలా పురాణాలేమిటి అని హాస్యమాడేవారు.

R S Hymavathi (@shr1234p) 's Twitter Profile Photo

ఏమీలేదండీ.ఎంచుమించు వారంరోజులుగా మాఅబ్బాయో కోడలో నాకు చేయందించి లాగి కూచోపెట్టాల్సొస్తోంది.