తెలుగు పద్యాలు(@TeluguPadyaalu) 's Twitter Profileg
తెలుగు పద్యాలు

@TeluguPadyaalu

#తెలుగు #తెలుగుపద్యాలు #సుమతీశతకం #వేమనశతకం #నరసింహశతకం #దాశరథీశతకం #శ్రీమదాంధ్రమహాభాగవతం #శ్రీకృష్ణశతకం

ID:1148572217493487616

calendar_today09-07-2019 12:38:50

700 Tweet

2,5K Takipçi

32 Takip Edilen

తెలుగు పద్యాలు(@TeluguPadyaalu) 's Twitter Profile Photo

అటఁ జని కాంచె భూమిసురుఁ డంబరచుంబిశిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్లుఠదభంగతరంగ మృదంగనిస్స్వన

స్ఫుటనటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్

గటకచరత్కరేణుకరకంపితసాలము శీతశైలమున్

-    అల్లసాని పెద్దన ( మను చరిత్ర)

account_circle
తస్సిత (𝕋𝕒𝕤𝕤𝕚𝕥𝕙𝕒)(@TassithaR) 's Twitter Profile Photo

🙏
చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నాచదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నింపొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!

ఎంత గొప్పగా వండినా ఉప్పు లేని కూర రుచించదు. అలాగే ఎంత చదివినా,

account_circle
తస్సిత (𝕋𝕒𝕤𝕤𝕚𝕥𝕙𝕒)(@TassithaR) 's Twitter Profile Photo

🙏
తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్
దలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

భావం : పామునకు తలయందు విషముండును. తేలుకు విషము తోకలో ఉండును. కానీ దుర్మార్గుడైన మనిషికి తల, తోక యనక శరీరమంతయు విషము ఉండును.

account_circle
తస్సిత (𝕋𝕒𝕤𝕤𝕚𝕥𝕙𝕒)(@TassithaR) 's Twitter Profile Photo

🙏
తరువు లతిరసఫలభార గురుత గాంచు
నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు
డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత
జగతి నుపకర్తలకు నిది సహజగుణము...!
భావం - బాగా పండ్లున్న చెట్లు ఆ భారంతో వినమ్రంగా వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు ఆ బరువుతో ఆకాశంలో మరీ పైపైన కాకుండా కిందుగా

account_circle
తస్సిత (𝕋𝕒𝕤𝕤𝕚𝕥𝕙𝕒)(@TassithaR) 's Twitter Profile Photo

🙏
సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు అధికబాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చుకొరకే తథ్యము సుమతీ!
తాత్పర్యం:
ఏదైనా అతి పనికిరాదని పెద్దలు అన్నారు. ఒక్కోసారి విపరీతానికి పోతే, సరసం విరసానికి, పరిపూర్ణ సుఖం కూడా అధిక బాధలకు, నిలువునా పెరగడం విరగడానికి

account_circle
R S Hymavathi(@shr1234P) 's Twitter Profile Photo

నీళ్ళలోన నోడ నిగిడి తిన్నగ బ్రాకు
బైట మూరెడైన బ్రాకలేదు
నెలవు దప్పుచోట నేర్పరి కొరగాడు
విశ్వదాభిరామ వినురవేమ

అనుకూలమైన చోట మనుషుల నేర్పరితనము పనిచేయునే గాని అనువుగానిచోట ఎంత నేర్పరైనా కొరగాడు.ఓడ నీటిలో పయనించునే గాని,బైట కొంచెమైనా కదలదు కదా!-వేమన శతక పద్యం

account_circle
R S Hymavathi(@shr1234P) 's Twitter Profile Photo

బుద్ధియుతున కేల పొసగని సఖ్యంబు
కార్యవాదికేల కడుచలంబు
కుత్సితునకు నేల గురుదేవతాభక్తి
విశ్వదాభిరామ వినురవేమ

బుద్ధిమంతునకు స్నేహము లేకపోవడ ముండదు.పని సాధించాలనుకునే వాడికి పట్టుదల ఉండదు.దుర్బుద్ధి గలవానికి గౌరవముండదు.వేమన శతక పద్యం

account_circle
R S Hymavathi(@shr1234P) 's Twitter Profile Photo

విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింపదలచి విష్ణుడవనగా
విశ్వము జెరుపను హరుడవు
విశ్వాత్మక నీవె యగును వెలయుచు కృష్ణా

ప్రపంచమంతటా నిండియున్న కృష్ణా!లోకములను సృష్టించుటకు బ్రహ్మగాను,రక్షించుటకు విష్ణువుగాను,కడకు నశింపజేయుటకు శంకరునిగాను నీవే పిలవబడుచున్నావు.కృష్ణ శతక పద్యం

account_circle
R S Hymavathi(@shr1234P) 's Twitter Profile Photo

మధురసములు గోరి మక్షికంబులు చేరి
చొచ్చివెడలలేక చొక్కినట్లు
మునిగి వెడలలేడు మోహంపురాశిలో
విశ్వదాభిరామ వినురవేమ

తీపివాసనకు ఆకర్షింపబడ్డ తేనెటీగలు తేనెలో చిక్కుకుని బైటికి రాలేనట్లు మూర్ఖులు విషయ వాంఛలకి లోబడి అందులో చిక్కుకుని వెలికిరాక ముక్తిని పొందలేరు.వేమన శతక పద్యం

account_circle
R S Hymavathi(@shr1234P) 's Twitter Profile Photo

వలపుల తేజీనెక్కియు
నిలపై ధర్మంబు నిలుప హీనుల ద్రుంపన్
కలియుగము తుదిని వేడుక
కలికివి గానున్న లోక కర్తవు కృష్ణా

శ్రీకృష్ణా!కలియుగాంతమున అందమైన గుర్రమునెక్కి క్రూరులను శిక్షించి ధర్మము నిలుపుటకై కలికి రూపముతో రానున్న లోక కర్తవు కదా!-కృష్ణ శతక పద్యం

account_circle