Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile
Srikanth Miryala

@miryalasrikanth

నాన్న/రచయిత #KGHKathalu/ Psychiatrist

ID: 160446402

linkhttps://instagram.com/psychiatristsrikanth?igshid=YmMyMTA2M2Y= calendar_today28-06-2010 05:38:45

9,9K Tweet

31,31K Takipçi

170 Takip Edilen

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

ఈరోజు ప్రపంచ ఆత్మహత్యా నివారణ దినోత్సవం. కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు. 2022లో మనదేశంలో లక్షాడెబ్బైవేలమంది ఆత్మహత్యకి పాల్పడ్డారని జాతీయ నేర చిట్టాల సంస్థ చెప్తోంది. ఇంకా నమోదుకాని ఆత్మహత్యలు ఇంకెన్నో. 2018తో పోలిస్తే ఈ సంఖ్య 27% ఎక్కువ. అంటే మనదేశంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి

ఈరోజు ప్రపంచ ఆత్మహత్యా నివారణ దినోత్సవం. కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు.

2022లో మనదేశంలో లక్షాడెబ్బైవేలమంది ఆత్మహత్యకి పాల్పడ్డారని జాతీయ నేర చిట్టాల సంస్థ చెప్తోంది. ఇంకా నమోదుకాని ఆత్మహత్యలు ఇంకెన్నో. 2018తో పోలిస్తే ఈ సంఖ్య 27% ఎక్కువ. అంటే మనదేశంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి
Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

ఎప్పుడో యండమూరి, యద్దనపూడి వాళ్ళ పుస్తకాలు కొన్ని కొనేవాళ్ళు తెలుగువాళ్లు, రెండు దశాబ్దాల తర్వాత తెలుగు పాఠకుల హృదయాన్ని ఒక ఊపు ఊపిన RaviMantrii గారికి శుభాకాంక్షలు. దీనిని సాధ్యం చేసిన అజు పబ్లికేషన్స్ | Aju Publications వారికి, అదే బాటలో నడుస్తున్న Anvikshiki Publishers వారికి నా అభినందనలు.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

ఉప్పు లేకపోతే యే వంటైనా చప్పగా ఉంటుంది, కానీ అదే ఉప్పెక్కువైతే ఒంటికి ముప్పెక్కువే.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

మేము చదువుకునే రోజుల్లో ప్రతిశుక్రవారం నాలుగు తెలుగు సినిమాలు విడుదలయ్యేవి, ఇప్పుడు పనిచేస్తున్న రోజుల్లో నాలుగు శుక్రవారాలకి ఒకటి విడుదలవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే తెలుగువాడిలో ఉన్న సినిమాప్రియుడ్ని సినిమానే చంపేస్తోంది. ఒకందుకు మంచిదే. అందరూ బంకు కొట్టకుండా బాగుపడతారు.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

ఒక పరిశీలన. శ్రీమతి రెండేళ్ల మాతృత్వ వ్యవధి తర్వాత మళ్లీ వైద్య వృత్తిలో చేరారు. ఆమె ఇంకా ఇక్కడి ఫెలోషిప్ సాధించాల్సి ఉన్నందున్న ప్రస్తుతానికి జూనియర్ వైద్యురాలిగా మెల్బోర్న్ నగరంలోని ఒక ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ జూనియర్ వైద్యుల్లో చాలా స్థాయిలుంటాయి, ఈమెకున్న అనుభవం

ఒక పరిశీలన.

శ్రీమతి రెండేళ్ల మాతృత్వ వ్యవధి తర్వాత మళ్లీ వైద్య వృత్తిలో చేరారు. ఆమె ఇంకా ఇక్కడి ఫెలోషిప్ సాధించాల్సి ఉన్నందున్న ప్రస్తుతానికి జూనియర్ వైద్యురాలిగా మెల్బోర్న్ నగరంలోని ఒక ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ జూనియర్ వైద్యుల్లో చాలా స్థాయిలుంటాయి, ఈమెకున్న అనుభవం
Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

ఒక రచయిత ఒక పుస్తకం రాస్తాడు, దానివెనక రెండు మూడు నకళ్లు ఉంటాయి. వాటి వెనక రాసి రాయకుండా చించేసిన పది భాగాలు ఉంటాయి, వాటికంటే ముందు రాసి వదిలేసిన వంద ప్రారంభాలుంటాయి. వీటన్నిటికంటే ముందు అలా వచ్చి వెళ్ళిపోయిన వెయ్యి ఆలోచనలు ఉంటాయి.

ఆధునిక తెలుగు నేనో అభినవ గిడుగుని, నేను తెలుగుకి తీస్తా ఒక ముసుగుని, దానికి తొడుగుతా కొత్త గొడుగుని. భాషా వింజామరలు వీచేచోట నేను నింజా పదాలు వాడతాను, నాకు లైకులొస్తే ఎంతకైనా వంగుతా, నాక్కోపం వస్తే నిన్ను మింగుతా, నేనో అభినవ గిడుగుని. పుస్తకాలకి నీకేవో పర్యాయపదాలుండొచ్చు,

ఆధునిక తెలుగు

నేనో అభినవ గిడుగుని,
నేను తెలుగుకి తీస్తా ఒక ముసుగుని,
దానికి తొడుగుతా కొత్త గొడుగుని.

భాషా వింజామరలు వీచేచోట
నేను నింజా పదాలు వాడతాను,
నాకు లైకులొస్తే ఎంతకైనా వంగుతా,
నాక్కోపం వస్తే నిన్ను మింగుతా,
నేనో అభినవ గిడుగుని.

పుస్తకాలకి నీకేవో పర్యాయపదాలుండొచ్చు,
Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

ఓపిక మా అబ్బాయికి అన్నం పెట్టే ఓపికలేదు, వాడిచేతికొక సెల్ఫోను ఇచ్చి నాకు నచ్చినంత కుక్కేస్తాను. మా పాపతో ఆడుకునే తీరికలేదు, దానికొక టీవీలో కార్టూన్ పెట్టేసి ఇంటి నుండే పని చేసుకుంటాను. ప్రయాణాల్లో వెనక్కెళ్లిపోయే చెట్లు కొండల గురించి చెప్పే ఉత్సాహం లేదు, మా పిల్లలకి ఒక ట్యాబ్

ఓపిక

మా అబ్బాయికి అన్నం పెట్టే ఓపికలేదు,
వాడిచేతికొక సెల్ఫోను ఇచ్చి నాకు నచ్చినంత కుక్కేస్తాను.

మా పాపతో ఆడుకునే తీరికలేదు, 
దానికొక టీవీలో కార్టూన్ పెట్టేసి ఇంటి నుండే పని చేసుకుంటాను.

ప్రయాణాల్లో వెనక్కెళ్లిపోయే చెట్లు కొండల గురించి చెప్పే ఉత్సాహం లేదు,
మా పిల్లలకి ఒక ట్యాబ్
Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

మీరు కావాలి అనుకోకపోయినాఅవాంఛిత గర్భంతో పిల్లలు పుట్టొచ్చు, మీకు అమ్మాయి కావాలనుకుంటే అబ్బాయి పుట్టొచ్చు, లేదా అబ్బాయనుకుంటే అమ్మాయి పుట్టొచ్చు, రంగు తక్కువ, రూపులేక పుట్టొచ్చు ఏదైనా గానీ వారి పుట్టుక మీకు ఇష్టం లేకపోవచ్చు. కొన్నాళ్లు మీరు చూడ్డానికి రాకపోవచ్చు లేదా సాకలి

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

చూడండి, ఇదేం బాలేదు, ప్రతిరోజూ నేను ఐదున్నరలోపే లేస్తాను, ఈరోజు ఆదివారం కాసేపు ఎక్కువ పడుకోనీకుండా ఇలా లేపి పుస్తకం చేతికిచ్చి చదవమనటం ఏమీ బాగాలేదు. ఇంకా ఎంతకాలం చదవాలి. ఇక చాలు.ఇలా లేపి చదివించటానికి మీరు నా హాస్టల్ వార్డెన్ కాదు, నాచిన్నకొడుకుని గుర్తుంచుకుంటే ఇద్దరికీ మంచిది.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

గుడ్డు ఒక సంపూర్ణ మాంసకృత్తువు (కంప్లీట్ ప్రొటీన్). ఇందులో దేహానికి కావాల్సిన అన్ని ఆవశ్యక అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఉడకబెట్టిన తెల్లసొనలు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. గుడ్డు దుష్ఫలితాలు లేని సహజ ఆహారం. పెరిగే పిల్లలు,గర్భిణీలు, వృద్ధులు, కండలు పెంచేవాళ్లు అందరూ తినొచ్చు.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

పొద్దున్నే ఒక పదినిమిషాలు వార్తలు చూస్తాను. ప్రతీ గడిచిన ఇరవైనాలుగ్గంటల్లో మా దేశంలో పెద్దగా ఏం జరగదు, జరిగినా అది వార్త కాదు, అందుకని మావాళ్లు అమెరికా,ఇంగ్లాండులో విషయాలు వార్తలుగా చెప్తారు. పరమబోరింగు మహాప్రభో…

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఒక చిన్న సలహా, ఏదేమైనాగానీ కడుపనో, కెరీర్ అనో ఒకర్ని విడిచి ఒకరు ఆర్నెల్ల కంటే ఎక్కువరోజులు జీవితంలో ఎప్పుడూ దూరంగా ఉండబోమని నిర్ణయించుకోండి. జీవితం బాగుంటుంది.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

2017లో నీట్ ప్రవేశ పరీక్షలో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించి, తర్వాత పీజీ రేడియాలజీ చదువుతున్న యువ వైద్యుడు కుంగుబాటు(డిప్రెషన్) కు గురై ఆత్మహత్యచేసుకుని చనిపోయారు. మిక్కిలి బాధాకరమైన వార్త. మానసిక రుగ్మతలకి ఎవరూ అతీతులు కారు. సత్వరమే సహాయం పొందండి.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

వినాయకుడ్ని అనుపుతారు. ఇది తెలుగుమాట. మనవాళ్లకి కొంచెం పోష్ గా ఉండాలి కాబట్టి తర్వాత నిమజ్జనం అన్నారు. ఇప్పుడు ఇదికూడా వదిలేసి విసర్జన్ అంటున్నారు. దానికి వీళ్లకింకా అర్థం తెలీదు. తెలీకపోడమే మంచిది.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

పొద్దున్నే ఇంటిదగ్గర ఈ పిట్టల కూతలు చాలా బాగుంటాయి.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

ఇప్పట్లో చాలామంది (అందరూ కాదు) తల్లిదండ్రులకి పెంపకం మీద కనీస అవగాహన ఉండటం లేదు, అలాగే సమయం కూడా ఉండట్లేదు. అటువంటివాళ్ల దగ్గరకంటే అప్పటికే పిల్లలపెంపకం మీద అనుభవం ఉన్న అమ్మమ్మలే మంచిది. బాల్యం వాళ్ల చేతిలో సురక్షితంగా ఉంటుంది.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

చూడండీ, మీ వయసెంతో అడిగి తెలుసుకోవడం నా పనిలో భాగం, దానికి ఆడాళ్ల వయసు మగాళ్ల సంపాదన అడక్కూడదని మీకు తెలీదా అంటే! మిమ్మల్నెవడూ బాగు చెయ్యలేడు.

కొంచెం వివరంగా, నేను కింద చెప్పిన మాటలో “ఇప్పట్లో చాలామంది” అంటే కొందరని నా ఉద్దేశ్యం. విషయం ఏమిటంటే, పిల్లల పెంపకం విషయంలో కనీస అవగాహన లేకుండా కొంతమంది అదో ఉద్యమంలా కనేస్తారు. ఇలాంటి తల్లిదండ్రులకి పుట్టిన పిల్లలు అమ్మానాన్న ఆలనాపాలనకి నోచుకోక నిర్లక్ష్యానికి (నెగ్లెక్ట్) గురై